రాకుమారుడు ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయాక తన తండ్రి రాజ్యం పై శత్రు సైన్యం దాడిచేసి రాజ్యాన్ని వశపరుచుకొని రాజకుటుంబాన్ని కొన్ని రోజులపాటు బందీలుగా చెరసాలలో బంధించి కొన్నేళ్ళ తరువాత విడుదల చేశారు. ఆ తరువాత వారు బిక్షాటన చేసుకుంటూ ఊరూరా తిరుగుతూ.... యువరాజు ఏలుతున్న రాజ్యానికి వస్తారు.
ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుంటుండగా రాజబటులు దొంగలనే అనుమానంతో వారిని బంధించి రాజమందిరానికి తీసుకొని వస్తారు.
రాజుముందు వారిని ప్రవేశపెట్టి విచారించగా.... వారు రాజుకు నమస్కరించి తమ వివరాలు తెలియజేస్తారు. పూర్రిగా గడ్డం పెంచుకొని.... చిరిగిన బట్టలతో కృంగి కృషించుకపోయి ఉన్నవారిని యువరాజు గుర్తించలేక పోతాడు.
వారు చెప్పిన వివరాలు విని ఉలిక్కిపడి.... వీరు తన తల్లిదండ్రులని గుర్తించి వారికి పాదాభివందనం చేసి నేను మీ కుమారున్ని అని చెప్పి వారందరిని తన రాజమదిరానికి ఆహ్వానించి తండ్రికి, సోదరులకు క్షౌరాది కృత్యాలు చేయించి నూతన వస్త్రాలు అందిస్తాడు.
తన భార్యలను పరిచయం చేసి వీరే నేను బాల్యంలో దూరమైన నా కుటుంబసభ్యులనీ.... వీరికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని అందరికి ఆజ్ఙాపిస్తాడు.
ఆతరువాత తన తండ్రి రాజ్యంపై దండెత్తిన వారి వివరాలు సేకరించి.... తన తండ్రి, సోదరులు, సైన్యాన్ని వెంటబెట్టకోని యుద్దానికి తరలివెళుతారు....
యుద్దానికి వెళ్ళేముందు పేదరాశి పెద్దమ్మ మాటలు జ్ఙప్తికొచ్చి తన తొడలో పెట్టుకున్న దేవకన్య వస్త్రాన్ని తన మాతృమూర్తి కి ఇచ్చి .... మంత్రోపదేశం చేసి.... ఎట్టి పరిస్థితులు ఈ వస్ర్తాన్ని ఎవరికీ చూపించవద్దని తన తల్లికి చెప్పి వారు యుద్దానికి బయలుదేరి వెళుతారు.
వీరోచిత పొరాటం చేసి విజయం సాధించి రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించి తిరుగు ప్రయాణమవుతారు.
విజయగర్వంతో ఇంటికి రాగానే హారతులిచ్చి స్వాగతం పలకాల్సిన తన భార్యలు రాకపోయేసరికి విచారంగా ఇంట్లోకి వెళ్తాడు.
ఇంట్లో ఎలాంటి సందడి లేకపోగా.... తన భార్యలు కనిపించకపోయేసరికి తన తల్లిని విషయం అడుగుతాడు.
అప్పుడు తల్లి విచారంగా జరిగిన విషయం ఇలా చెబుతుంది.
ఇంకా ఉంది.... 10

No comments:
Post a Comment