Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు - 2వ బాగం



రాజుకు నలుగురు 2

రాజు నిర్ణయానికి రాణి ఉలిక్కి పడుతుంది. గారాలకొడుకుకు ఉరిశిక్షా.... ఏంటీ నాకీశిక్ష అంటూవేదన చెందుతూ దీనికేదైనా తరుణోపాయం ఆలోచించాలంటూ రాత్రంతా నిదురలేకుండా... ఆలోచిస్తూ.... అందరూ పడుకున్న సమయంలో తనవద్ద ఉన్న బంగారు నాణాలను ఒక మూటలో కట్టి, తినడానికి రొట్టెలు పెట్టి అశ్వాన్ని ఇచ్చి.... ఎటైనా పారిపో అని చెప్పి కొడుకును ఏడుస్తూ పంపించి వేస్తుంది ఆ తల్లి హృదయవేదనతో.....

తల్లి పాదాలకు నమస్కరించి బయలుదేరిన రాకుమారుడు.... రాత్రంతా అశ్వంపై ప్రయాణం సాగిస్తూ.... సాగిస్తూ.... తన రాజ్యాన్ని దాటి అడవులద్వారా ప్రయాణం సాగిస్తుంటాడు.... తనకు బాగా దాహం వేస్తుండటంతో దూరంలో కనిపిస్తున్న నదివద్దకు వెళ్ళి దాహార్తి తీర్చుకుందామనుకుంటుండగా.... ఆ నీటిలో కొట్టుకుపోతున్న చీమలు రాకుమారున్ని చూసి ఆర్తిగా చూస్తుంటాయి. వాటి బాధను అర్ధం చేసుకున్న రాకుమారుడు ఒక కర్ర సహాయంతో ఆ చీమలన్నిటినీ పక్కనున్న ఒడ్డుకు సురక్షితంగా చేరుస్తాడు. ఆ చీమలన్నీ ఆ రాకుమారునికి కృతజ్ఞతలు తెలిపి రాకుమారా నీకెప్పుడు ఏ సహాయం కావాల్సినా మమ్మల్ని పిలువు వెంటనే వచ్చి నీకు సహాయం చేస్తాము అని చెప్పి వెళ్తాయి .....

రాకుమారుడు కాసేపు విశ్రాంతి తీసుకోని తిరిగి ప్రయాణం చేస్తుండగా.... మధ్యాహ్నం వేల ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటుండగా ... తుమ్మెదలపై దాడి జరుగుతుంది. అప్పుడు యువరాజు ఆ తుమ్మెదలను కాపాడి రక్షిస్తాడు .... ఆ తుమ్మెదలు కృతజ్ఙతాభావంతో రాకుమారా.... నీకెప్పుడు మా సహాయం కావాల్సివచ్చినా మాకు తెలియజేయండి.... మీకు మా వంతు సహాయసహకారాలను అందిస్తాము. అని చెప్పి వెళ్ళిపోతావి. రాకుమారుడు తాను తెచ్చుకున్న రొట్టెలు తిని తిరిగి బయలు దేరి వెళ్తుంటాడు....

ఇంకాఉంది.....3

No comments:

Post a Comment