Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు - 1వ బాగము


రాజుకు నలుగురు 1

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు నలుగురు కుమారులు. ఒకరోజు రాజు వెన్నెల రాత్రిలో చందమామ కింద పట్టెమంచంపై పడుకొని తనకుమారులను ఒక్కొక్కరిని పిలిపించి ఇలా అడుగుతున్నాడు.

కుమారా .... ఈ సమయంలో నీకేమి చేయాలని పిస్తుంది అని అడుగగానే పెద్దవాడు ఇలా సమాదానం చెబుతాడు.
తండ్రీ .... శత్రుసైన్యంపై దండెత్తి పొరుగు రాజ్యాలను హస్తగతం చేసుకోవాలని ఉంది అనగానే భళాకుమారా భళా.... ఇక నీ వెళ్ళవచ్చు అని పంపిస్తాడు.

ఇక రెండవవాడి సమాదానం ఇలా ఉంది... తండ్రీ .... ఈ సమయంలో మన సైనికులకు యుద్ద నైపుణ్యతలో శిక్షణ అందించాలని ఉంది అనగానే కొడుకును మెచ్చుకొని వెళ్ళమంటాడు.

ఇక మూడవవాడు... తండ్రీ ఈ సమయంలో అశ్వ విహారం చేస్తూ శతృగూడాచార రహస్యాలను తెలుసుకోవాలని ఉంది అంటాడు.... రాజుగారు తన పుత్రులకు రాజ్యము పై ఉన్న ఆకాంక్షను చూసి ఉబ్బితబ్బిబైపోతాడు.

చివరివాడిని పిలిచి కుమారా ఈ పున్నమి వెన్నెల సమయంలో నీకేమి చేయాలనిపిస్తుందో సెలవియ్యమనగానే....

తండ్రీ..... పట్టె మంచంపై పడుకొని... నాలుగు ప్రక్కల నలుగురు సురకన్యలు నించుని చామరాలతో వీస్తుండగా.... హాయిగా నిద్రించాలని ఉంది ప్రభూ అని తెలపగానే.....

రాజుగారికి ఎక్కడలేని కోపం వస్తుంది.  చీ దుర్మార్గుడా.... రాజపుత్రుడవయ్యుండి.... రాజ్యక్షేమము కాకుండా నిద్రమత్తును కోరుకుంటావా అంటూ ఎవరక్కడ అని భటులను పిలిచి.... కొడుకనికూడా చూడకుండా వీనికి రేపు సూర్యోదయం అవగానే ఉరిశిక్ష వేయుడు అని ఆజ్ఙాపిస్తాడు....

ఇంకా ఉంది.....2

No comments:

Post a Comment