రాజుకు నలుగురు 4వ బాగం
ఆరోజు సూర్యోదయం కాకముందే పశువులను తోలుకుంటూ ఉత్తరం దిశగా వెళ్తాడు....
అక్కడ అందమైన సరస్సు ఉంది.... సుగందాలు వెదజల్లే చక్కటి పూతోటలు....
చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం.... అసలు ఇది భూమ్మీదేనా అన్నట్టు ఉంది.... అంతేకాదు.... ఆ పక్కనే సరస్సులో దేవకన్యలు జలకాలాడుతున్నారు..... ఇంకేముంది రాకుమారుని కళ్ళు జిగేల్ జిగేల్ మన్నాయి .... వారి వస్త్రములు ఓ పక్క పడేసి ఉన్నాయి.... వెంటనే వాటిని తీసుకొని పరుగెత్తడం ప్రారంభించాడు..... అది కనిపెట్టిన దేవకన్నికలు రాకుమారుని వెంట నగ్నంగా పరిగెత్త ప్రారంభించారు. వారు నన్ను చూడు నా అందం చూడు... మానవా నన్ను చూడు నా అందం చూడు అనుకుంటూ వస్తున్నారు. ఏంటబ్బా అనుకుంటూ.... సరే ఒకసారి వారందం కూడా చూస్తే పోలా అనుకోని వెనక్కు తిరిగి చూస్తాడు.... అంతే అక్కడే శిల్పమై పొతాడు.
ఆ దేవకన్యలు వచ్చి తమ బట్టలు తీసుకొని ఇంద్రలోకం వెళ్తారు....
సాయంసమయం అయినా రాకుమారుడు ఇంకా రాకపోవడంతో ఎందుకో పేదరాశి పెద్దమ్మకు అనుమానం వచ్చి ఉత్తరం దిశగా వెళ్తుంది.... చుట్టుప్రక్కల పశువులు మేస్రూయుండగా ఓ శిల అక్కడ నిలుచొని ఉంటుంది. పెద్దమ్మ కు అనుమానం వచ్చి మంత్రజలం చల్లగానే ఆ శిల్పం రాకుమారునిగా మారుతుంది. మనవడిని తీసుకొని ఇంటికి వస్తారు.
నేనటు వెళ్ళొద్దన్నా.... ఎందుకు వెళ్ళావురా... నేనురాకుంటే నీ గతి ఏంకాను... అంటూ తిడుతుంది. ఆ రాకుమారుడు ససేమిరా అంటున్నాడు... నాకా కన్య కావాలంటూ పట్టుపట్టాడు.
పెద్దమ్మను బ్రతిమిలాడుకున్నాడు.
తినకుండా అలిగి పండుకున్నాడు.
ఇక కాదనలేక పెద్దమ్మ ఒక సలహా ఇచ్చింది. ఉదయమే ఎప్పటిలాగే వెళ్ళి వాళ్ళు స్నానమాడుతుండగా ఒక కన్య బట్టలు తీసుకొని పరెగెత్తుకొని రా.... వాళ్ళు నన్నుచూడు నా అందం చూడు అనుకుంటూ నిన్ను వెంబడిస్తారు...
నువ్వు అస్సలు వెనుకకు చూడకుండా వచ్చేయి... మిగిలిన తంతు నేను చూసుకుంటా అని చెప్పి పంపిస్తుంది పెద్దమ్మ.
రాకుమారుడు కూడా అలాగే పెద్దమ్మ చెప్పినట్టు చేస్తాడు.... ఆ వస్త్రాలు తీసుకొని వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ కుటీరానికి చేరుకోగానే.... ఆ పెద్దమ్మ ఆ వస్ర్తాన్ని తన మంత్ర శక్తితో తనతొడలో పెట్టుకుంటుంది. రాకుమారున్నిదాచేస్తుంది
అర్ధనగ్నంగా పరుగెత్తుకుంటూ వచ్చిన దేవకన్య... అవ్వా... ఇక్కడికెవరైనా నా వస్త్రాలతో వచ్చారా అని అడుగగానే పెద్దవ్వ లేదమ్మా... ముందు ఆ బట్టలు చుట్టుకో అని తన బట్టలు ఇస్తుంది.
దేవతా వస్త్రాలు లేకుండా తను దేవలోకం పోలేదని పెద్దమ్మకు తెలుసు.... అందుకే ఆ బట్టలు మాయం చేసింది. ఇక తన మాయతో ఆ కన్యను కూడా తనవద్దనే ఉంచుకోసాగింది....
అలా వారిద్దరినీ మాయలోపడేసి... ప్రేమలోదింపి ఇద్దరికీ పెళ్ళిచేస్తుంది.
ఆతరువాత....
ఇంకాఉంది. 5

No comments:
Post a Comment