రాజుకు నలుగురు - 3వ బాగం
రాత్రంతా ప్రయాణం చేసీ.... చేసీ అలసిపోయి నది ఒడ్డున గల ఓ పురాతన గృహం ముందు చేరుకుంటాడు.
అక్కడ తన అశ్వాన్ని ఆపి ఎవరు లోపల అని పిలవగానే ఓ వృద్ధురాలు బయటకు వస్తుంది .... ఎవరుబాబూ నీవు అని అడిగి కాళ్లు కడుక్కోని లోపలికి రమ్మంటుంది... లోనికివెళ్ళి.... అమ్మా మీపేరేమి, మీరుఒక్కరే ఇక్కడ ఏల నివసిస్తున్నారని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయగా .... తనపేరు పేదరాశి పెస్దమ్మ అని అంటారని.... తనకెవరూలేరనీ... ఇక అంతకు మించి తననేమీ అడగవద్దనీ.... చెప్పి. నీకు వీలైనన్ని రోజులు తనవద్ద ఉండమని చెబుతుంది పేదరాశిపెద్దమ్మ.
తన వద్ద ఉన్న పశువులు కాసుకుంటూ నాకు చేదోడు వాదోడుగా ఉండమని చెబుతూ.... తూర్పు, పడమర, దక్షణ దిశలకు వెళ్ళు కానీ.... ఉత్తరం దిశకు మాత్రం వెళ్ళొద్దని చెబుతుంది ఆమె.
రాకుమారుడు తన వద్ద ఉన్న నాణేలు ఆమెకు ఇచ్చి ఇక అక్కడే ఉంటుంటాడు.
రోజుకు ఓ వైపు పశువులను కాసుకుంటున్న రాకుమారుడు ఉత్తరం వైపుకు ఎందుకు వద్దన్నదా అనే అనుమానంతో ఎలాగైనా ఈరోజు ఉత్తరం వైపు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.
ఇంకాఉంది.....4

No comments:
Post a Comment