Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు..... 6వ బాగం...


రాజుకు నలుగురు 6వ బాగం

ఆ దేశపు మంత్రి స్త్రీ లోలుడు.... తన కంట పడితే చాలు... ఎలాంటి అమ్మాయినైనా వశపరుచుకోవడమే తనలక్ష్యం

ఒకరోజు యువరాజుని రాజు తన అంతరంగిక రక్షకుడిగా నియమిస్తూ సభకు పరిచయం చేస్తాడు. అప్పటికే  వారిద్వారా.... వీరిద్వారా యువరాజు భార్య అందం విషయమై తెలుసుకున్న మంత్రి ఎప్పుడెప్పుడు తనను చూడాలా అని ముచ్చట పడేవాడున అలా ఆరోజు చూసింది మొదలు ఇక ఆ దేవకన్యను వశపరుచుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకొని తదనుగుణంగా పావులు కదపడం మొదలెట్టాడు.

రాకుమారుని భార్య దేవకన్య పై మనసుపడ్డ మంత్రి ఎలాగైనా రాకుమారున్ని హతమార్చి ఆ దేవకన్యను తన స్వంతం చేసుకోవాలని కుఠిలయత్నాలు చేస్తుంటాడు.

ఇందులో బాగంగా ఒకరోజు రాత్రి మంత్రి రాకుమారున్నిపిలుస్తాడు.

రా సేనాధిపతీ.... రా.... నీతో ఒక రహస్య విషయం తెలియజేయవలెను.... అందుకే ఈ వేళలో పిలిపించాను అంటూ పిలిచిన విషయాన్ని వివరిస్తాడు.

రాణి గారు ఒక రుగ్మతతో బాధపడుతుంది. దానికి నాగమణి తోనే వైద్యం నయమవుతుందని వైద్యులు నిర్దారించారు. ఇందుకు సమర్ధునివి నీవే అని రాజుగారు నీకీ పని అప్పగించమన్బారు.  ఎలాగైనా అడవిలోకేగి ఈ పౌర్ణమినాడు మాత్రమే వెలువడే ఆ నాగమణిని తీసుకొని రావాలి అని ఆదేశించాడు.

సరే అని మాటిచ్చి ఇంటికి చేరుకున్న రాకుమారుడు ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తుండగా తన భార్య దేవకన్య చూసి .... నాధా మీరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు.. అదోలా ఉన్నారు అనగానే... ఉలిక్కిపడ్డ రాకుమారుడు అదేంలేదంటూ తటపటాయించాడు.... వెంటబడి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది దేవకన్య.... విషయం తెలిస్తే ఎక్కడ భయపడుతుందో అని నిదానంగా బయపడుతూ బయపడుతూ అసలు విషయం చెప్పాడు రాకుమారుడు.

అంతా వినగానే ఎలా ప్రతిస్పందిస్తుందో అని బయంతో ఉన్న సమయంలో రాకుమారి నోట ఓస్ ఈ దానికే ఇంత
బయమెందుకు రా తినుకుంటూ మాట్లాడుకుందాం అంటూ ధైర్యం చెప్పిలోనికి తీసుకెళ్ళింది....

అప్పుడిలా చెప్పింది దేవకన్య.... చూడండీ నాగరాజు మరెవరో కాదు... మా బాబాయే అవుతాడు. నేను బాబాయ్ కి లేఖ రాసి ఇస్తాను నీకు రాచమర్యాదలు చేసి నాగమణి ని ఇచ్చి పంపిస్తాడు అని చెప్పి నాగరాజు చిరునామాతో సహా ఇచ్చి పంపిస్తాడు.

ఆ ప్రకారంగా వెళ్లిన రాకుమారుడు అడవిలోకి వెళ్ళి నాగమందిరంలో గల పెద్ద పుట్టలో ఈ లేఖను వేయగానే నాగరాజు తన బృందంతో మేళతాళములతో వచ్చి అల్లుడిని తీసుకొని వెళ్తాడు....

క్షేమ సమాచారములు తెలుసుకొని తనడిగిన నాగమణి తో పాటు తన కూతురు నాగకన్య ను కూడా ఇచ్చి పెళ్ళిచేసి పంపుతారు...

తనను.... తన రెండవ భార్యను ఇద్దరినీ సాధరంగా ఇంట్లోకి ఆహ్వానించింది దేవకన్య...

ఇక నాగమణి కోసం వచ్చిన మంత్రిగారికి నాగకన్య దర్శనమివ్వడంతో మెదడు మొద్దుబారిపోయింది.  ఇంకేమీ మాట్లాడక నాగమణికూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు.

ఇక మంత్రికి ఎటూ తోయడం లేదు.
ఏంటీమాయ.... అసలే మొదటిది అందెగత్తె అనుకుంటే.... దానిని మించిన అప్సరస ఇప్పుడొచ్చి చేరింది....  వీడిని లేపేస్తే ఒకతి నాకు.... ఇంకొకతి రాజుకు ఉంపుడుగత్తెగా ఉంటుంది అనుకుంటూ... మరో ఎత్తుగడకు పూనుకున్నాడు మంత్రి.

ఇంకా ఉంది 7

No comments:

Post a Comment