Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు.... 11వ బాగం



రాజుకు నలుగురు 11వ బాగం

ఆరథం దేవలోకం చేరగానే.... దేవేంద్రుడు ఒక్కసారిగా.... నరవాసన.... నరవాసన... అంటూ.... అరుస్తుంటాడు..... దేవబటులంతా తిరుగుతూ.... రథం కిందదాచుకున్న రాకుమారున్ని బందించి దేవేంద్రుని ముందు ప్రవేశ పెడతారు....

దేవదేవా.... ఇదుగో మానవ మాత్రుడు.... దొంగచాటుగా దెవకన్య రథంలో దాచుకొని వచ్చాడు అని దేవేంద్రుని ముందు హాజరు పరుస్తారు.

అప్పుడు దేవేంద్రుడు ఓరీ తుచ్చమానవుడా.... ఎంత ధైర్యంరా నీకు.... మా అనుమతి లేకుండా నా లోకప్రవేశం చేస్తావా.... ఇంతకీ ఎవరునీవు.... నీకు మరణశిక్ష విధిస్తున్నాము అని బెదిరించగానే....

రాకుమారుడు శాంతంగా.... వెటకారంగా... మామా దేవేంద్ర.... నన్నే మరిచితివా... అకటకటా.... ఎంతమాట... ఎంతమాట.... మాకు మరణశిక్ష విధించుటయా... మరెందుకు ఆలస్యం ..... మరణశిక్ష విధించండి అంటాడు.

అలాగైతే నాతోపాటు.... ఇన్నాళ్ళూ ఈ మానవ మాత్రునితో ఎన్నో రాత్రులు గడిపిందే నీ గారాల కూతురు.... దానినీ ఉరితీయండి.... మేం కలిసి బ్రతకలేకపోయినా.... కనీసం కలిసైనా చస్తాం అంటాడు.

అందుకు దేవేంద్రుడు నెవ్వరపోయి... వీడేంటి... మామా యనుట ఏంటి? అని అనుకుంటూ అసలు విషయం తెలుసుకుంటాడు.

ఇక ఏంచేయాలో తోచక తన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాడు....

వీరితోపాటు నాగరాజు, మృగరాజు, అగ్నిదేవున్ని కూడా ఆహ్వానించి జరగవలసిన విషయాన్ని చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు....

ఇంకాఉంది... 12వ బాగం

రాజుకు నలుగురు .... 10వ బాగం


రాజుకు నలుగురు .... 10

కుమారా! నీవు యుద్దానికి బయలుదేరేముందు నాకు నీవిచ్చిన దేవతా వస్త్రాన్ని నీవు చెప్పినట్టుగానే నా తొడలో మంత్ర శక్తితో బద్రపరిచాను.

నీవు యుద్దానికి వెళ్ళినాక కోడళ్ళందరూ కలిసి నావద్దకు వచ్చి నన్ను బ్రతిమిలాడారు.... అత్తయ్యగారూ.... మీ కుమారుడు మీకేదో బద్రపరచమని ఇచ్చారు.... అదేంటో మాకూ చూపించవచ్చు కదా అని.

అందుకు నేను ససేమిరా అన్నాను.... కాని వారు ఎంతకూ వినిపించుకోలేదు.... చాలా నిష్టూరంగా మాటలాడినారు. అదేంటత్తయ్యా..... మీకు.... మీ కుమారునికి మేమే అంటరానివారమయ్యామా అనీ.... అవునులే ఇన్నాళ్ళూ మేము పనికివచ్చాము.... ఇప్పుడు మీరొచ్చారుగా ఇక మేమెందుకు పనికివస్తాము అనీ.... సరే ఇక మీరూ మీ కుమారులే ఉండండి.... మేము మా తల్లిగారిండ్లకు వెళ్తాం అనీ.... ఇలా ఎన్నెన్నో మాటలాడారు బాబూ.... 

నేనువచ్చి మీ మద్య ఎందుకు గొడవలు పెట్టడం అని దానిని తీసి వారకి చూపించాను. అంతే....

నలుగురు కోడళ్ళు ఒకేచోట కూర్చోని ఆ వస్త్రాన్ని కప్పుకొని గాలిలో ఎగిరిపోయారు.... ఇంతకూ ఎవర్రా వాళ్ళంతా అని అడిగింది అమ్మ....

నిస్తేజంగా అలాగే గోడకు కూలిపోయాడి యువరాజు..... అందరూ తనను తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టి అసలు విషయం అడుగుతారు.  అప్పుడు జరిగిందంతా చెప్పి.... ఇక తన భార్యలు లేనిది నేనూ రాజ్యంలో ఉండననీ.... చెప్పి తన రాజ్యాన్ని తన సోదరులకు అప్పగించి తను తన దేవకన్యలను వెతుకుతూ బయలుదేరుతాడు.

ఎంత వెతికినా వారి ఆచూకి మాత్రం తెలియరాలేదు.  చివరికి పేదరాశిపెద్దమ్మ ఇంటికి చేరుకుంటాడు.

పేదరాశిపెద్దమ్మ కాళ్ళపై పడిపోయి ఎక్కి ఎక్కిఏడుస్తూ జరిగిందంతా చెబుతాడు.

అప్పుడు పేదరాశిపెద్దమ్మ కూడా తనవలన ఏమీకాదనీ తేల్చి చెబుతుంది. మరెలా అని బ్రతిమిలాడుకుంటాడు. అప్పుడు ఒక్క విషయం మాత్రం చెబుతుంది....

ఎక్కడైతే నీవు మొదటిసారి రాకుమార్తెను చూశావో.... తిరిగి అక్కడికే బయలుదేరు. అక్కడ నీ దేవకన్య కనిపిస్తుంది. వెళ్ళి అడిగి తీసుకొచ్చుకో.... అని చెబుతుంది. 

తెల్లవారకముందే సరస్సు చేరుకున్నాడు రాకుమారుడు, అప్పటికే దేవకన్య చెలికత్తెలతో స్నానమాచరిస్తుంది. ఆ ప్రదేశం వరకు వెళ్లి..... తన భార్యను పట్టుకోపోతాడు. వారు ఇతనికి అందకుండా.... గుర్తుకూడా పట్టకుండా దొరకకుండా జలకాలడి బట్టలు మార్చుకుంటుంటారు.   రాకుమారుడు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండానే దేవలోకానికి బయలుదేరి వెళ్తారు.
ఎంతో నిరాశ చెందిన రాకుమారుడు తన పట్టుమాత్రం వదలకుండా మరుసటిరోజువరకు అక్కడే వాఎఇకోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తాడు. తెల్లవారింది .... దేవకన్నయలు ఎప్పిటిలాగే జలకాడటం కోసం వచ్చారు. ఇక వారిని కలిసి ప్రయోజనం లేదనుకొని ఆ ప్రక్కనే వారి రథం ఉంది,  వెళ్ళి రథం కింద దాచుకున్నాడు.... దేవకన్య జలకాలాడి రథం ఎక్కి బయలుదేరి వెళ్ళబోతుండగా.... రాకుమారుడు అ రథం కింద దాచుకొని రథంతో పాటు దేవలోకం చేరుకుంటాడు.

ఇంకా ఉంది 11


రాజుకు నలుగురు... 9వ బాగం



రాజుకు నలుగురు... 9వ బాగం

రాకుమారుడు ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయాక తన తండ్రి రాజ్యం పై శత్రు సైన్యం దాడిచేసి రాజ్యాన్ని వశపరుచుకొని రాజకుటుంబాన్ని కొన్ని రోజులపాటు బందీలుగా చెరసాలలో బంధించి కొన్నేళ్ళ తరువాత విడుదల చేశారు. ఆ తరువాత వారు బిక్షాటన చేసుకుంటూ ఊరూరా తిరుగుతూ.... యువరాజు ఏలుతున్న రాజ్యానికి వస్తారు.

ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుంటుండగా రాజబటులు దొంగలనే అనుమానంతో వారిని బంధించి రాజమందిరానికి తీసుకొని వస్తారు.

రాజుముందు వారిని ప్రవేశపెట్టి విచారించగా....  వారు రాజుకు నమస్కరించి తమ వివరాలు తెలియజేస్తారు. పూర్రిగా గడ్డం పెంచుకొని.... చిరిగిన బట్టలతో కృంగి కృషించుకపోయి ఉన్నవారిని యువరాజు గుర్తించలేక పోతాడు.

వారు చెప్పిన వివరాలు విని ఉలిక్కిపడి.... వీరు తన తల్లిదండ్రులని గుర్తించి వారికి పాదాభివందనం చేసి నేను మీ కుమారున్ని అని చెప్పి వారందరిని తన రాజమదిరానికి ఆహ్వానించి తండ్రికి, సోదరులకు క్షౌరాది కృత్యాలు చేయించి నూతన వస్త్రాలు అందిస్తాడు.

తన భార్యలను పరిచయం చేసి వీరే నేను బాల్యంలో దూరమైన నా కుటుంబసభ్యులనీ.... వీరికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని అందరికి ఆజ్ఙాపిస్తాడు.

ఆతరువాత తన తండ్రి రాజ్యంపై దండెత్తిన వారి వివరాలు సేకరించి.... తన తండ్రి, సోదరులు, సైన్యాన్ని వెంటబెట్టకోని యుద్దానికి తరలివెళుతారు....

యుద్దానికి వెళ్ళేముందు పేదరాశి పెద్దమ్మ మాటలు జ్ఙప్తికొచ్చి తన తొడలో పెట్టుకున్న దేవకన్య వస్త్రాన్ని తన మాతృమూర్తి కి ఇచ్చి .... మంత్రోపదేశం చేసి....  ఎట్టి పరిస్థితులు ఈ వస్ర్తాన్ని ఎవరికీ చూపించవద్దని తన తల్లికి చెప్పి వారు యుద్దానికి బయలుదేరి వెళుతారు.

వీరోచిత పొరాటం చేసి విజయం సాధించి రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించి తిరుగు ప్రయాణమవుతారు.

విజయగర్వంతో ఇంటికి రాగానే హారతులిచ్చి స్వాగతం పలకాల్సిన తన భార్యలు రాకపోయేసరికి విచారంగా ఇంట్లోకి వెళ్తాడు.

ఇంట్లో ఎలాంటి సందడి లేకపోగా.... తన భార్యలు కనిపించకపోయేసరికి తన తల్లిని విషయం అడుగుతాడు.

అప్పుడు తల్లి విచారంగా జరిగిన విషయం ఇలా చెబుతుంది.

ఇంకా ఉంది.... 10

రాజుకు నలుగురు... 8వ బాగం


రాజుకు నలుగురు 8వ బాగం

అలా బయటకు వచ్చి భర్తకు కడుపునిండా భోజనంపెట్డి తినిపిస్తూ ఇలా చెబుతారు...

మేమొక ఉత్తరం ఇస్తాము, దానిని ముందుగా అగ్నిలో వేసి ఆతరువాత మీరు అగ్నిలో దూకండి. అంతా ఆ అగ్ని దేవుడే చూసుకుండాడు. అని ధైర్యం చెబుతారు ముగ్గురు భార్యలు.

ఇక ఉదయమే మంత్రి వద్దకు వెళ్ళి తన అంగీకారం తెలియజేస్తాడు.

మంత్రి రాజుగారి అనుమతితో పెద్ద అగ్ని హోత్రాన్ని ఏర్పాటుచేస్తారు

మంచి ముహూర్తాన రాజు, మంత్రి, పురప్రజల సమక్షములో అగ్ని ప్రవేశానికి సంసిద్దమవుతుండగా..... రాజు గారు తమ పితృదేవతలకు ఇవ్వవలసిన బంగారు పత్రంపై వ్రాసిన ఆహ్వానపత్రికలను సేనాధిపతి కి ఇచ్చి.... ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తే.... నిన్ను సామంత రాజును చేస్తానని ప్రజలముందు వాగ్దానం చేస్తాడు.

ఇక గత్యంతరం లేని పరిస్థితులలో రాకుమారుడు తన భార్యలు చెప్పినట్లుగా అగ్ని దేవునికి నమస్కరించి భార్యలు ఇచ్చిన లేఖను అందులో వేసి అందరికీ నమస్కరించి తానూ అగ్నిలో దూకుతాడు.

మంత్రి మనస్సులో పీడవదిలింది అని తనలోతను సంతోషపడుతూ.... ఇంటికి వస్తాడు.

ఇక తనకు అడ్డెవరూలేరనీ.... రాకుమారుని ముగ్గురు భార్యలు ఇక తనవశం కానున్నారని విందుఏర్పాటుచేసి ఆనందంగా కలలుగంటుంటాడు.

ఒకటి, రెండు, మూడు, ఇలా వారం రోజులైనా రాకుమారుడు రాకపోయేసరికి రాజుతో పాటు పురప్రజలందరూ అవేదనకు లోనవుతుంటారు.

రాజు ఇక ఆపుకోలేక మంత్రిని పిలిపించి... రాకుమారుని జాడ ఏమైనా తెలిసిందా అని అడగుతాడు. అందుకు మంత్రి రాజా... అంతటి అగ్ని హోత్రంలో దూకిన ఏ మనవుడైనా కాలిబూడిదవ్వడమే తప్ప తిరిగి రావడముంటుందా అంటాడు. అవునా అయ్యో.... మన సైన్యాధిపతి ని మనం కోల్పోయినట్టేనా.... సరే ఆ మంటలను ఆర్పించి అతని ఆనవాళ్ళు ఏమైనా ఉంటే తన కుటుంబసభ్యులకు అందజేయండి అని ఆజ్ఙాపిస్తారు.

మంత్రి తన అనుచరులతో అగ్నిని ఆర్పించే ఏర్పాట్లు చేస్తుండగా.... అగ్బిలోంచి మరో అందమైన సుందరితో బయటకు వస్తుంటాడు రాకుమారుడు.

అదిచూసిన మంత్రి గుండె ఆగినంతొనౌతుంది. రాజుగారికి విషయం తెలువగానే బాజాబదంత్రీలతో పయరంలోకి తీసుకువస్తారు....

తనభార్యలు అగ్నిదేవుని కూతుర్ని సాదరంగా ఆహ్వానించి ఎలాజరిగింది ప్రయాణం అని అడుగుతారు.

అందుకు రాకుమారుడు ఈ విధంగా తెలియజేస్తాడు. మీరిచ్చిన లేఖను అగ్నిహోత్రంలో వేయగానే అప్పటివరకూ వేడిగా ఉన్న ఆప్రదేశం నామటుకు ఒక్క సారిగా చల్లగా మారిపోయింది, ఇక అందులో దూకగానే ఇద్దరు భటులు రథంతో సిద్ధంగా ఉన్నారు. నన్నుఅగ్ని దేవుని వద్దకు తీసుకెళ్ళి నా పనులను అన్నీ చేసిపెట్టి తన కూతురును ఇచ్చి వివాహం చేసి పంపించారు అని తన అనుభవాలు తన భార్యలతో పంచుకున్నాడు.

రాజుగారు ఇచ్చిన మాటమీద సైన్యాధిపతి ని ఓ రాజ్యానికి సామంతరాజుగా ప్రకటిస్తాడు.

నలుగురు భార్యలతో పాటు రాజ్యాధికారాన్నికూడా చేపట్టడంతో కుమిలిపోతూ ఉన్న మంత్రి మానసిక వ్యధతో మంచం పడుతాడు.

ఇలా రాజ్యాధికారాన్ని కొనసాగిస్తుండగా ఒకరోజు ఏంజరిగిందంటే....

ఇంకాఉంది... 9


రాజుకు నలుగురు..... 6వ బాగం...


రాజుకు నలుగురు 6వ బాగం

ఆ దేశపు మంత్రి స్త్రీ లోలుడు.... తన కంట పడితే చాలు... ఎలాంటి అమ్మాయినైనా వశపరుచుకోవడమే తనలక్ష్యం

ఒకరోజు యువరాజుని రాజు తన అంతరంగిక రక్షకుడిగా నియమిస్తూ సభకు పరిచయం చేస్తాడు. అప్పటికే  వారిద్వారా.... వీరిద్వారా యువరాజు భార్య అందం విషయమై తెలుసుకున్న మంత్రి ఎప్పుడెప్పుడు తనను చూడాలా అని ముచ్చట పడేవాడున అలా ఆరోజు చూసింది మొదలు ఇక ఆ దేవకన్యను వశపరుచుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకొని తదనుగుణంగా పావులు కదపడం మొదలెట్టాడు.

రాకుమారుని భార్య దేవకన్య పై మనసుపడ్డ మంత్రి ఎలాగైనా రాకుమారున్ని హతమార్చి ఆ దేవకన్యను తన స్వంతం చేసుకోవాలని కుఠిలయత్నాలు చేస్తుంటాడు.

ఇందులో బాగంగా ఒకరోజు రాత్రి మంత్రి రాకుమారున్నిపిలుస్తాడు.

రా సేనాధిపతీ.... రా.... నీతో ఒక రహస్య విషయం తెలియజేయవలెను.... అందుకే ఈ వేళలో పిలిపించాను అంటూ పిలిచిన విషయాన్ని వివరిస్తాడు.

రాణి గారు ఒక రుగ్మతతో బాధపడుతుంది. దానికి నాగమణి తోనే వైద్యం నయమవుతుందని వైద్యులు నిర్దారించారు. ఇందుకు సమర్ధునివి నీవే అని రాజుగారు నీకీ పని అప్పగించమన్బారు.  ఎలాగైనా అడవిలోకేగి ఈ పౌర్ణమినాడు మాత్రమే వెలువడే ఆ నాగమణిని తీసుకొని రావాలి అని ఆదేశించాడు.

సరే అని మాటిచ్చి ఇంటికి చేరుకున్న రాకుమారుడు ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తుండగా తన భార్య దేవకన్య చూసి .... నాధా మీరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు.. అదోలా ఉన్నారు అనగానే... ఉలిక్కిపడ్డ రాకుమారుడు అదేంలేదంటూ తటపటాయించాడు.... వెంటబడి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది దేవకన్య.... విషయం తెలిస్తే ఎక్కడ భయపడుతుందో అని నిదానంగా బయపడుతూ బయపడుతూ అసలు విషయం చెప్పాడు రాకుమారుడు.

అంతా వినగానే ఎలా ప్రతిస్పందిస్తుందో అని బయంతో ఉన్న సమయంలో రాకుమారి నోట ఓస్ ఈ దానికే ఇంత
బయమెందుకు రా తినుకుంటూ మాట్లాడుకుందాం అంటూ ధైర్యం చెప్పిలోనికి తీసుకెళ్ళింది....

అప్పుడిలా చెప్పింది దేవకన్య.... చూడండీ నాగరాజు మరెవరో కాదు... మా బాబాయే అవుతాడు. నేను బాబాయ్ కి లేఖ రాసి ఇస్తాను నీకు రాచమర్యాదలు చేసి నాగమణి ని ఇచ్చి పంపిస్తాడు అని చెప్పి నాగరాజు చిరునామాతో సహా ఇచ్చి పంపిస్తాడు.

ఆ ప్రకారంగా వెళ్లిన రాకుమారుడు అడవిలోకి వెళ్ళి నాగమందిరంలో గల పెద్ద పుట్టలో ఈ లేఖను వేయగానే నాగరాజు తన బృందంతో మేళతాళములతో వచ్చి అల్లుడిని తీసుకొని వెళ్తాడు....

క్షేమ సమాచారములు తెలుసుకొని తనడిగిన నాగమణి తో పాటు తన కూతురు నాగకన్య ను కూడా ఇచ్చి పెళ్ళిచేసి పంపుతారు...

తనను.... తన రెండవ భార్యను ఇద్దరినీ సాధరంగా ఇంట్లోకి ఆహ్వానించింది దేవకన్య...

ఇక నాగమణి కోసం వచ్చిన మంత్రిగారికి నాగకన్య దర్శనమివ్వడంతో మెదడు మొద్దుబారిపోయింది.  ఇంకేమీ మాట్లాడక నాగమణికూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు.

ఇక మంత్రికి ఎటూ తోయడం లేదు.
ఏంటీమాయ.... అసలే మొదటిది అందెగత్తె అనుకుంటే.... దానిని మించిన అప్సరస ఇప్పుడొచ్చి చేరింది....  వీడిని లేపేస్తే ఒకతి నాకు.... ఇంకొకతి రాజుకు ఉంపుడుగత్తెగా ఉంటుంది అనుకుంటూ... మరో ఎత్తుగడకు పూనుకున్నాడు మంత్రి.

ఇంకా ఉంది 7

రాజుకు నలుగురు.... 7వ బాగం



రాజుకు నలుగురు 7వ బాగం

వీడిని పాములు ఏమీ చేయలేక పోయాయి.... దానికన్నా పెద్ద ఎత్తే వేయాలి అని ఆలోచించి ..... 
సేనాధిపతి తో తిరిగి సమావేశమయ్యాడు మంత్రి.... నాగమణితో నయమవ్వదట రాణిగారి సమస్య.... మృగరాజు కోరలు కావాలంట అని మరో ఎత్తుగడ వేస్తాడు మంత్రి..... అదేంటి రాజా అన్నిటికీ నన్నే పంపిస్తున్నారు అని అడుగగా.... నీవైతేనే సమర్ధుడవు అని రాజుగారు గుర్తించి నిన్నే పంపిస్తున్నారు.... అని చెప్పి పంపించాడు. 

ఎప్పటిలాగే ఇంట్లికెళ్ళాక తిరిగి బాధపడుతుండగా ఇద్దరు భార్యలు వచ్చి విషయం అడిగి తెలుసుకొని నవ్వుకుంటారు.... వారిని తదేకంగా చూసి.... ఏంటి నేను మృగరాజు చేతిలో మరణించాలని చూస్తున్నారా.... తెగ ఆనందపడిపోతున్నారు అని అనగానే.... ఇద్సరూ అయ్యో అలాకాదండీ అంటూ అసలు విషయం చెప్పారు. మృగరాజు మాకు చాలా కావాల్సినవారు మీకెందుకు భయం.... మీరు నిశ్ఛింతగా వెళ్ళిరండి అని చెప్పి పంపిస్తారు. భార్యలు చెప్పినట్టుగానే వెళ్ళి మృగరాజుతో రాచమర్యాదలు పొంది మృగరాజు కుమార్తెను కూడా పెళ్ళిచేసుకొని వస్తాడు రాకుమారుడు.....

ఇద్దరు భార్యలు కలిసి కొత్త దంపతులకు స్వాగతం పలుకుతారు.... 

బంట్లద్వారా విషయం తెలుసుకున్న మంత్రి హుటాహుటిన రాకుమారుని ఇంటికి వచ్చి మూడో భార్యను చూసేసరికి కళ్ళుచెదిరిపోయి పడిపోతాడు.... 

నిద్రాహారాలు మాని ఇక లాభం లేదు ఈ సారి వీడిని చంపేందుకు పెద్ద ఎత్తేవేయాలి అని ఆలోచించి.... ఆలోచించి.... ఒక నిర్ణయానికి వస్తాడు.... ఈ సారి తను చెబితే నమ్మడని తెలిసి రాజు గారిద్వారా చెప్పించే ప్రయత్నం చేశాడు.....

ఒక రోజు తన ముగ్గురు భార్యలతో కలిసి ముచ్చటిస్తుండగా.... రాజుగారి నుండి కబురొస్తుంది.... 

హుటాహుటిన వెళ్ళిన రాకుమారునికి రాజుగారు మంత్రి మాటలువిని ఈ విధంగా విషయం చెప్పాడు....

సేనాధిపతీ.... మేము మా పితృకార్యాలను తలపెట్టదలిచాము.... మీరు ఆ విషయాన్ని మా పితృదేవలకు తెలియజేసి రావలెను అని చావుకబురు చల్లగా చెబుతాడు.

అదెలా మహారాజా అని ఆశ్చర్యంగా అడిగిన రాకుమారున్ని చూసి... ఎలా వెళ్ళాలో ఏంటో మా మంత్రి గారు వివరిస్తారు అని రాజుగారు బయలుదేరి వెళ్ళిపోతారు.

మంత్రి ఇలా చెబుతున్నాడు.... ఏమీలేదు యోధుడా.... మేము అడవిలోని ఎండిపోయిన చెట్ల్టన్నీ చితిగా పేరుస్తాము.... అట్టి అగ్నిలో దూకి రాజుగారి పితృదేవులందరికీ ఆహ్వానపత్రాలు అందజేసి రావాలి అని చెప్పాడు.

అగ్నికి ఆహుతయ్యాక బూడిదే కదా అయ్యేది.... తిరిగి రావడం ఎలా అనుకుంటూ... ఇంటికొచ్చేసరికి.... ముగ్గురు భార్యలు ఎదురుచూసి ఆహ్వానిస్తారు.... ఏంటని విషయం అడిగి తెలుసుకొంటారు.... ముగ్గురు నిశ్శబ్ధంగా లోపలికి వెళ్ళగానే రాకుమారుడు నీరసపడిపోతాడు.... ఇక చేసేది ఏమీలేదనుకొంటుండగా.... ముగ్గురూ నవ్వుకుంటూ బయటకు వస్తారు.

ఇంకా ఉంది 8వ బాగం

రాజుకు నలుగురు..., 5వ బాగం


రాజుకు నలుగురు 5వ బాగం

ఒకరోజు ఆ ప్రాంతానికి చెందిన రాజు వేటకని వీరుండే ప్రాంతానికి వస్తారు. అయితే రాజుపై కొందరు గజదొంగలు అదును చూసి దాడికి పాల్పడితారు. అక్కడే పశువులను మేపుకుంటూ తిరుగుతున్న యువరాజు ఆ దుండగలబారినుండి రాజును రక్షిస్తాడు. 

గాయాలతో బాధపడుతున్న ఆ రాజును యువరాజు పేదరాశి పెద్దమ్మ ఇంటికి తెచ్చి జరిగిన విషయం అమ్మతో చెబుతాడు. పేదరాసి పెద్దమ్మ రాజుకు వైద్యం చేసింది. 

కాసేపు విశ్రాంతి తీసుకున్నాక రాజు వారికి కృతజ్ఙతలు తెలిపి , యువరాజు పోరాటాన్ని ప్రశంసించి, మీకేవిధంగా సహాయం పడగలనో తెలపండి అని వారితో అనగానే.... పెద్దమ్మ నా మనవడికి మీ రాజ్యంలో ఏదైనా కొలువు ఇప్పించండి మహారాజా మీకు ఋణపడిఉంటా అని వేడుకుంటుంది. 

అందుకు ఆ రాజు భలే పెద్దమ్మ భలే... మా మనసులోని కోరికను మీరే వెల్లడించారు... ఈ క్షణం నుండి ఈ ధీరున్ని నా అంతరంగ రక్షకునిగా నియమిస్తున్నాను. అని రాజువెళ్లిపోతాడు..

ఒక శుభముహూర్తాన పేదరాసి పెద్దమ్మ.వారిద్దరినీ రాజ్యానికి చేరవేసి, రాజుకు అప్పగించి వారితో కొత్తకాపురం పెట్టిస్తుంది.

 అలా అన్యోన్యంగా వారి దాంపత్యం కొనసాగుతుండగా.... ఒకరోజు....

ఇంకాఉంది ... ,6వ బాగం


రాజుకు నలుగురు - 4వ బాగం


రాజుకు నలుగురు 4వ బాగం

ఆరోజు సూర్యోదయం కాకముందే పశువులను తోలుకుంటూ ఉత్తరం దిశగా వెళ్తాడు.... 

అక్కడ అందమైన సరస్సు ఉంది.... సుగందాలు వెదజల్లే చక్కటి పూతోటలు.... 

చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం.... అసలు ఇది భూమ్మీదేనా అన్నట్టు ఉంది.... అంతేకాదు.... ఆ పక్కనే సరస్సులో దేవకన్యలు జలకాలాడుతున్నారు..... ఇంకేముంది రాకుమారుని కళ్ళు జిగేల్ జిగేల్ మన్నాయి .... వారి వస్త్రములు ఓ పక్క పడేసి ఉన్నాయి.... వెంటనే వాటిని తీసుకొని పరుగెత్తడం ప్రారంభించాడు..... అది కనిపెట్టిన దేవకన్నికలు రాకుమారుని వెంట నగ్నంగా పరిగెత్త ప్రారంభించారు.  వారు నన్ను చూడు నా అందం చూడు... మానవా నన్ను చూడు నా అందం చూడు అనుకుంటూ వస్తున్నారు. ఏంటబ్బా అనుకుంటూ.... సరే ఒకసారి వారందం కూడా చూస్తే పోలా అనుకోని వెనక్కు తిరిగి చూస్తాడు.... అంతే అక్కడే శిల్పమై పొతాడు. 

ఆ దేవకన్యలు వచ్చి తమ బట్టలు తీసుకొని ఇంద్రలోకం వెళ్తారు....
సాయంసమయం అయినా రాకుమారుడు ఇంకా రాకపోవడంతో ఎందుకో పేదరాశి పెద్దమ్మకు అనుమానం వచ్చి ఉత్తరం దిశగా వెళ్తుంది.... చుట్టుప్రక్కల పశువులు మేస్రూయుండగా ఓ శిల అక్కడ నిలుచొని ఉంటుంది. పెద్దమ్మ కు అనుమానం వచ్చి మంత్రజలం చల్లగానే ఆ శిల్పం రాకుమారునిగా మారుతుంది. మనవడిని తీసుకొని ఇంటికి వస్తారు. 

నేనటు వెళ్ళొద్దన్నా.... ఎందుకు వెళ్ళావురా... నేనురాకుంటే నీ గతి ఏంకాను... అంటూ తిడుతుంది. ఆ రాకుమారుడు ససేమిరా అంటున్నాడు... నాకా కన్య కావాలంటూ పట్టుపట్టాడు.
పెద్దమ్మను బ్రతిమిలాడుకున్నాడు. 
తినకుండా అలిగి పండుకున్నాడు. 
ఇక కాదనలేక పెద్దమ్మ ఒక సలహా ఇచ్చింది. ఉదయమే ఎప్పటిలాగే వెళ్ళి వాళ్ళు స్నానమాడుతుండగా  ఒక కన్య బట్టలు తీసుకొని పరెగెత్తుకొని రా.... వాళ్ళు నన్నుచూడు నా అందం చూడు అనుకుంటూ నిన్ను వెంబడిస్తారు... 
నువ్వు అస్సలు వెనుకకు చూడకుండా వచ్చేయి... మిగిలిన తంతు నేను చూసుకుంటా అని చెప్పి పంపిస్తుంది పెద్దమ్మ.

రాకుమారుడు కూడా అలాగే పెద్దమ్మ చెప్పినట్టు చేస్తాడు.... ఆ వస్త్రాలు తీసుకొని వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ కుటీరానికి చేరుకోగానే.... ఆ పెద్దమ్మ ఆ వస్ర్తాన్ని తన మంత్ర శక్తితో తనతొడలో పెట్టుకుంటుంది. రాకుమారున్నిదాచేస్తుంది

అర్ధనగ్నంగా పరుగెత్తుకుంటూ వచ్చిన దేవకన్య... అవ్వా... ఇక్కడికెవరైనా నా వస్త్రాలతో వచ్చారా అని అడుగగానే పెద్దవ్వ లేదమ్మా... ముందు ఆ బట్టలు చుట్టుకో అని తన బట్టలు ఇస్తుంది. 

దేవతా వస్త్రాలు లేకుండా తను దేవలోకం పోలేదని పెద్దమ్మకు తెలుసు.... అందుకే ఆ బట్టలు మాయం చేసింది. ఇక తన మాయతో ఆ కన్యను కూడా తనవద్దనే ఉంచుకోసాగింది.... 

అలా వారిద్దరినీ మాయలోపడేసి... ప్రేమలోదింపి ఇద్దరికీ పెళ్ళిచేస్తుంది.
ఆతరువాత....

ఇంకాఉంది. 5


రాజుకు నలుగురు - 3వ బాగం


రాజుకు నలుగురు - 3వ బాగం

సాయంత్రం అవ్వగానే ఒక కొలను ప్రక్కన కూర్చోని సేద తీర్చుకుంటుండగా చిన్న చిన్న కప్పలను గోండ్రు కప్పలు వేటాడుతూ తింటుంటాయి .... వాటినికూడా కాపాడి.... వాటి అభయాన్నికూడా పొంది ఇక బయలుదేరుతాడు....

రాత్రంతా ప్రయాణం చేసీ.... చేసీ అలసిపోయి నది ఒడ్డున గల ఓ పురాతన గృహం ముందు చేరుకుంటాడు.
అక్కడ తన అశ్వాన్ని ఆపి ఎవరు లోపల అని పిలవగానే ఓ వృద్ధురాలు బయటకు వస్తుంది .... ఎవరుబాబూ నీవు అని అడిగి కాళ్లు కడుక్కోని లోపలికి రమ్మంటుంది... లోనికివెళ్ళి.... అమ్మా మీపేరేమి, మీరుఒక్కరే ఇక్కడ ఏల నివసిస్తున్నారని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయగా .... తనపేరు పేదరాశి పెస్దమ్మ అని అంటారని.... తనకెవరూలేరనీ... ఇక  అంతకు మించి తననేమీ అడగవద్దనీ.... చెప్పి. నీకు వీలైనన్ని రోజులు తనవద్ద ఉండమని చెబుతుంది పేదరాశిపెద్దమ్మ.

తన వద్ద ఉన్న పశువులు కాసుకుంటూ నాకు చేదోడు వాదోడుగా ఉండమని చెబుతూ.... తూర్పు, పడమర, దక్షణ దిశలకు వెళ్ళు కానీ.... ఉత్తరం దిశకు మాత్రం వెళ్ళొద్దని చెబుతుంది ఆమె.
రాకుమారుడు తన వద్ద ఉన్న నాణేలు ఆమెకు ఇచ్చి ఇక అక్కడే ఉంటుంటాడు.

రోజుకు ఓ వైపు పశువులను కాసుకుంటున్న రాకుమారుడు ఉత్తరం వైపుకు ఎందుకు వద్దన్నదా అనే అనుమానంతో ఎలాగైనా ఈరోజు ఉత్తరం వైపు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.

ఇంకాఉంది.....4

రాజుకు నలుగురు - 2వ బాగం



రాజుకు నలుగురు 2

రాజు నిర్ణయానికి రాణి ఉలిక్కి పడుతుంది. గారాలకొడుకుకు ఉరిశిక్షా.... ఏంటీ నాకీశిక్ష అంటూవేదన చెందుతూ దీనికేదైనా తరుణోపాయం ఆలోచించాలంటూ రాత్రంతా నిదురలేకుండా... ఆలోచిస్తూ.... అందరూ పడుకున్న సమయంలో తనవద్ద ఉన్న బంగారు నాణాలను ఒక మూటలో కట్టి, తినడానికి రొట్టెలు పెట్టి అశ్వాన్ని ఇచ్చి.... ఎటైనా పారిపో అని చెప్పి కొడుకును ఏడుస్తూ పంపించి వేస్తుంది ఆ తల్లి హృదయవేదనతో.....

తల్లి పాదాలకు నమస్కరించి బయలుదేరిన రాకుమారుడు.... రాత్రంతా అశ్వంపై ప్రయాణం సాగిస్తూ.... సాగిస్తూ.... తన రాజ్యాన్ని దాటి అడవులద్వారా ప్రయాణం సాగిస్తుంటాడు.... తనకు బాగా దాహం వేస్తుండటంతో దూరంలో కనిపిస్తున్న నదివద్దకు వెళ్ళి దాహార్తి తీర్చుకుందామనుకుంటుండగా.... ఆ నీటిలో కొట్టుకుపోతున్న చీమలు రాకుమారున్ని చూసి ఆర్తిగా చూస్తుంటాయి. వాటి బాధను అర్ధం చేసుకున్న రాకుమారుడు ఒక కర్ర సహాయంతో ఆ చీమలన్నిటినీ పక్కనున్న ఒడ్డుకు సురక్షితంగా చేరుస్తాడు. ఆ చీమలన్నీ ఆ రాకుమారునికి కృతజ్ఞతలు తెలిపి రాకుమారా నీకెప్పుడు ఏ సహాయం కావాల్సినా మమ్మల్ని పిలువు వెంటనే వచ్చి నీకు సహాయం చేస్తాము అని చెప్పి వెళ్తాయి .....

రాకుమారుడు కాసేపు విశ్రాంతి తీసుకోని తిరిగి ప్రయాణం చేస్తుండగా.... మధ్యాహ్నం వేల ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటుండగా ... తుమ్మెదలపై దాడి జరుగుతుంది. అప్పుడు యువరాజు ఆ తుమ్మెదలను కాపాడి రక్షిస్తాడు .... ఆ తుమ్మెదలు కృతజ్ఙతాభావంతో రాకుమారా.... నీకెప్పుడు మా సహాయం కావాల్సివచ్చినా మాకు తెలియజేయండి.... మీకు మా వంతు సహాయసహకారాలను అందిస్తాము. అని చెప్పి వెళ్ళిపోతావి. రాకుమారుడు తాను తెచ్చుకున్న రొట్టెలు తిని తిరిగి బయలు దేరి వెళ్తుంటాడు....

ఇంకాఉంది.....3

రాజుకు నలుగురు - 1వ బాగము


రాజుకు నలుగురు 1

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు నలుగురు కుమారులు. ఒకరోజు రాజు వెన్నెల రాత్రిలో చందమామ కింద పట్టెమంచంపై పడుకొని తనకుమారులను ఒక్కొక్కరిని పిలిపించి ఇలా అడుగుతున్నాడు.

కుమారా .... ఈ సమయంలో నీకేమి చేయాలని పిస్తుంది అని అడుగగానే పెద్దవాడు ఇలా సమాదానం చెబుతాడు.
తండ్రీ .... శత్రుసైన్యంపై దండెత్తి పొరుగు రాజ్యాలను హస్తగతం చేసుకోవాలని ఉంది అనగానే భళాకుమారా భళా.... ఇక నీ వెళ్ళవచ్చు అని పంపిస్తాడు.

ఇక రెండవవాడి సమాదానం ఇలా ఉంది... తండ్రీ .... ఈ సమయంలో మన సైనికులకు యుద్ద నైపుణ్యతలో శిక్షణ అందించాలని ఉంది అనగానే కొడుకును మెచ్చుకొని వెళ్ళమంటాడు.

ఇక మూడవవాడు... తండ్రీ ఈ సమయంలో అశ్వ విహారం చేస్తూ శతృగూడాచార రహస్యాలను తెలుసుకోవాలని ఉంది అంటాడు.... రాజుగారు తన పుత్రులకు రాజ్యము పై ఉన్న ఆకాంక్షను చూసి ఉబ్బితబ్బిబైపోతాడు.

చివరివాడిని పిలిచి కుమారా ఈ పున్నమి వెన్నెల సమయంలో నీకేమి చేయాలనిపిస్తుందో సెలవియ్యమనగానే....

తండ్రీ..... పట్టె మంచంపై పడుకొని... నాలుగు ప్రక్కల నలుగురు సురకన్యలు నించుని చామరాలతో వీస్తుండగా.... హాయిగా నిద్రించాలని ఉంది ప్రభూ అని తెలపగానే.....

రాజుగారికి ఎక్కడలేని కోపం వస్తుంది.  చీ దుర్మార్గుడా.... రాజపుత్రుడవయ్యుండి.... రాజ్యక్షేమము కాకుండా నిద్రమత్తును కోరుకుంటావా అంటూ ఎవరక్కడ అని భటులను పిలిచి.... కొడుకనికూడా చూడకుండా వీనికి రేపు సూర్యోదయం అవగానే ఉరిశిక్ష వేయుడు అని ఆజ్ఙాపిస్తాడు....

ఇంకా ఉంది.....2