రాజుకు నలుగురు 12 వ బాగం
రచన : గోగులపాటి కృష్ణమోహన్
దేవేంద్రా... ఇప్పుడేమి మన తక్షణ కర్తవ్యం?
అందుకు దేవేంద్రుడు ఆవేశంగా... ఆ నరుడు మనకు అల్లుడు అవడమేమి? నాకంటే తెలియక జరిగింది. మరి తెలిసి మీరెందుకు ఇచ్చినట్టు? మీ బుద్ది ఏమయ్యింది అని ఆవేశంతో ప్రశ్నిస్తాడు.
అప్పుడు ఆ వరుణ దేవుడు, అగ్ని దేవుడు, నాగరాజులు ఒకే సమాదానము చెబుతారు.
ఆర్యా! మీ కూతురు మాకు ప్రత్యేక ఉత్తరము వ్రాస్తేనే మా కూతురును ఇచ్చి చేయడం జరిగింది. మీకు తెలుసుకదా... చిన్ననాటి నుండి వారు నలుగురు ఎంతగా కలిసి మెలిసి తిరిగేవారో... ఇప్పుడు భర్తను కూడా అలాగే కలిసి పంచుకుంటున్నారు.
అది వినగానే దేవేంద్రుడు మండి పడ్డాడు. ఇప్పుడు ఆ నరుడిని ఇక్కడినుండి ఇక్కడే యమలోకం పంపిచ్చేద్దాం పదండి అనగానే... యముడు ప్రత్యక్షం అవుతాడు... దేవేంద్రా ప్రణామములు... ఏమియా ఆవేశము... ఎందులకా నిర్ణయము... ఏ నేరము చేశాడని ఆ నరున్ని నేను యమపురికి గైకొని పోవలె అని ప్రశ్నిస్తాడు.
అదేమి యమా... నీవు తలుచుకుంటే అదెంతపని అని అనగానే... అందుకు యముడు దేవేంద్రా... నేను దర్మపరాయణుడను... బ్రహ్మ రాసిన తలరాతకు విరుద్దంగా నేనేమీ చేయలేను, మన్నించండి, సెలవు అంటూ అక్కడినుండి నిష్కమిస్తాడు యముడు.
ఇక ఏమి చేయాలా అని అనుకుంటున్న తరుణంలో...
నారాయణ నారాయణ... అందరికీ వందనం... ఏంటో ఈ రహస్య సమావేశం... అంటూ నారదుడు ప్రవేశించగానే... అందరికి గుండె ఆగినంత పనౌతుంది.
ఎవరివరకు ఈ విషయం వెళ్ళవద్దు అనుకున్నామో... ఆయనే రావడంతో ఇక తమ పరువు పోయినట్టే అని, ఎలాగైనా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరూ నారదున్ని వేడుకుంటారు.
నారదా ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా నీవే చక్కటి సలహాలు సూచనలు ఇచ్చేవాడవు. ఇప్పుడూ మీరే ఎలాగోలా వాడిని హతమార్చే సలహా ఇవ్వండి. అనగానే... నారదుడు అడుగుతాడు...
ఇంతకీ ఆ నరుడు చేసిన నేరమేమి అనగానే... ఆ నరుడు దొంగచాటుగా దేవలోకం చేరుకొని మా కన్యలను కావాలని కోరుతున్నాడు అని చెప్పగానే... నారదుడు ఆశ్చర్యంగా... ఏమి దేవేంద్ర మీ కూతుళ్లు కన్యలా.... నారాయణ నారాయణ ఎంతమాట? ఎంతమాట...? ఇన్నాళ్ళూ కాపురం చేసివచ్చిన వారు కన్యలేమి దేవేంద్రా? అయినా ఆ మానవుడు మీ దేవలోకం వస్తే తప్పు... అనర్హుడు? కానీ అదే మానవుడితో ఇన్ని రోజులు కాపురం చేసి వచ్చిన మీ కూతుళ్ళు మాత్రం దేవలోకానికి వస్తే అర్హులా? ఇదేమి న్యాయం దేవేంద్రా అని అడగగానే అందరూ ఆలోచనలో పడుతారు.
సరే నారదా... ఇప్పుడు మనమేం చేయాలి.. కింకర్తవ్యం సెలవిండు అని దేవేంద్రడు నారదున్ని సలహా అడుగుతాడు.
అప్పుడు నారదుడు ఇలా సలహా ఇస్తాడు.
ఇంకా ఉంది 13వ బాగం

No comments:
Post a Comment