Thursday, April 9, 2020

రాజుకు నలుగురు 18వ బాగం


రాజుకు నలుగురు 18వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

అప్పుడు నారదుడు ఆ దేవేంద్రుడిని పక్కకు తీసుకెళ్ళి... ఓ దానవేంద్రా... నీవు ఇంకేమీ ఆలోచించకు... ఇది నీ పూర్వ జన్మ శాప ఫలమే తప్ప మరొకటి కాదు. ఆ శాప ఫలమే నీవు ఈ మానవున్ని అల్లుడిగా స్వీకరించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసి వస్తుంది.. ఇది దైవేచ్చే తప్ప మరొకటి కాదు. అంటూ పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తాడు నారదుడు.
అప్పుడు తేరుకున్న దేవేంద్రుడు ఆ మానవున్ని తన అల్లుడిగా ప్రకటిస్తూ... తన కూతురితో పాటు... నాగకన్య, జలకన్య, అగ్ని కన్యలను ఇచ్చి ఘనంగా వివాహం జరిపించి భులోకానికి పంపిస్తారు.
భూ లోకానికి చేరుకున్న యువరాజుకు రాజ్య ప్రజలంతా ఘన స్వాగతం పలుకుతారు.  ఆ దేశ రాజు కూడా అస్వస్థతకు గురై తన రాజ్యానికి యువరాజుకే పట్టాభిషేకం చేస్తాడు...
యువరాజు చుట్టు ప్రక్కల రాజ్యాలన్నీ వీరోచితంగా పోరాడుతూ తన వశం చేసుకుంటాడు తన సోదరులను ఒక్కో రాజ్యానికి రాజులను చేసి రాజ్యాలను అప్పగిస్తాడు.
తన పరిపాలనలో రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటుంటారు.
ఒకరోజు నిండు పౌర్ణమి రోజున రాజు తల్లితండ్రులు మేడపైకి వెళ్ళి చూడగా... మల్లెపందిరి కింద పట్టెమంచం మీద తన చిన్న కొడుకు పడుకొని ఉండగా... నాలుగు దిక్కులు నలుగురు దేవకన్యలు తన కుమారునికి సపర్యలు చేస్తుండగా చూసిన ఆ రాజుకు ఆ రోజు కుమారుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి.... అవి "తండ్రీ..... పట్టె మంచంపై పడుకొని... నాలుగు ప్రక్కల నలుగురు సురకన్యలు నించుని చామరాలతో వీస్తుండగా.... హాయిగా నిద్రించాలని ఉంది ప్రభూ అని"...
వెంటనే తన భార్యతో... దేవీ చూడు నీ గారాల కుమారుడు... అన్నమాట నిలబెట్టుకున్నాడు అంటూ ఎంతో సంతోషిస్తాడు ఆ రాజు తన నలుగురు కుమారులతో... ఆ యువ రాజు తన నలుగురు భార్యలతో...
ఇదే ఆ రాజుకు నలుగురు..
సమాప్తం
ఈ కథ నా చిన్నవయసులో మా నానమ్మ కీll శేll రాలు గోగులపాటి నర్సుబాయమ్మ గారు నాకు చిన్నతనంలో చెప్పిన కథను అక్షరీకరించి మీకు అందించాను... అయితే దీనిని చదివిన కొందరు పాఠకులు (ప్రతిలిపి లో మరియు వాట్సప్ లలో) ఇది జగదేకవీరుని కథ (పాతది) పోలి వుందని తెలియజేశారు. అప్పుడు నేను ఆ సినిమా చూసాక తెలిసింది దాదాపుగా అలాగే ఉంది. (క్లైమాక్స్ తప్ప). కానీ ఇది నేను విన్న కథ ఆధారంగా మాత్రమే రాయడం జరిగింది అని తెలియజేస్తున్నాను.
కథను నిత్యం చదివి ప్రోత్సహించిన పాఠకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఙతాభివందనాలు తెలియజేసుకుంటూ...
రచయిత
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653


శుభం

No comments:

Post a Comment