Thursday, November 26, 2020

నోటుకే మా ఓటు - గోగులపాటి కృష్ణమోహన్

 నోటుకే మా ఓటు
రచన : గోగులపాటి కృష్ణమోహన్

నోటుకే మా ఓటు

ఎం మామ ఎం ఆలోచిస్తున్నావు.... అని అడిగాడు అనిల్ తన మిత్రుడు అఖిల్ ను... ఆ ఎం లేదు మామ... గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరికీ ఓటు వేద్దామా అని ఆలోచిస్తున్నాను... అని సమాధానం చెప్పాడు అఖిల్. ఇందులో ఆలోచించడానికి ఏముంది మామ.. నోటిచ్చిన వాడికే ఓటేస్తే సరి... మా తాతల కాలం నుండి ఇదే ఆచరిస్తూ వస్తున్నారు అని సమాధానం ఇచ్చాడు అఖిల్, దీంతో ఒక్కసారిగా కంగారు పడ్డ అనిల్ అదేంటి మామ ఆలా అన్నావు అని అనేసరికి.. మరేంటి మామ ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. చేసిన వాగ్దానాలతో సంబంధం లేదు, చేయని అభివృద్ధి తో సంబంధం లేదు, స్థానిక, సంస్థాగత ఎన్నికలకు సైతం స్థానిక అభ్యర్థితో సంబంధం లేకుండా ప్రాంతీయ, జాతీయ స్థాయి పార్టీలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి మామ.

పోనీ ఆ పార్టీలైన సరైన అభ్యర్థిని నిలబెడుతాయా అంటే ఆదీలేదు... పేరుకు మాత్రమే రిజర్వేషన్లు మామ, అభ్యర్థులు మాత్రం ప్రధాన నాయకుల అనుచరులకో... అర్దాంగికో... ఇస్తూ... పెత్తనం మాత్రం వారి చేతిలోనే ఉంచుకుంటున్నారు.   ఇదీ దుస్థితి మామ... అందుకే నా ఓటు నోటుకే వేద్దామనుకుంటున్న... అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడు అఖిల్.

నిజమే అఖిల్ నువ్వు చెప్పినట్టు మా ఏరియాలో మహిళా రిజర్వేషన్ ఉంటేనూ స్థానిక మహిళా విభాగం అధ్యక్షురాలికి లేదా సీనియర్ మహిళా నాయకురాలికి టికెట్ ఇస్తారని అనుకున్న... కానీ ఆలా చేయకుండా మాజీ నాయకుని భార్యకే టికెట్ ఇచ్చారు... తనకే ఏమి తెలియదు... ఆరోగ్యం కూడా సరిగా లేదు... పాపం పడుతూ లేస్తూ ప్రచారం చేస్తుంది అని వాపోయాడు అనిల్.

కానీ నువ్వన్నట్టు నోటుకే ఓటు వేద్దామా అని అనుమానం వ్యక్త పరిచాడు అనిల్. అప్పుడు అఖిల్ స్పందిస్తూ... మరేం చేయమంటావు మామ... వద్దన్నా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతున్నట్టు బేరసారాలకు దిగుతున్నారు. డబ్బులు వద్దంటే నిష్ఠూరంగా… అయితే మాకు ఓటు వేయవన్న మాట అంటూ వారికీ వారే ఊహాగానాలు, నిందారోపణలు చేస్తున్నారు. పోనీ తీసుకుందామా అంటే మనసు అంగీకరించడం లేదు అందుకే నీకు ఆ సమాధానం చెప్పా అన్నాడు అఖిల్.

నిజమే అఖిల్, నువ్వన్నట్టు స్థానిక ఎన్నికలకు కూడా కోట్లలో ఖర్చు పెడుతున్నారు, కనీసం స్థానిక సమస్యల పట్ల అవగాహనలేని వారిని నిలుచోబెడుతున్నారు. ఇక వారు ఎం మాట్లాడుతారు, ఎం పనులు చేసి పెడుతారు. ఏంటో ఆలోచిస్తే అంతా అయోమయం గందరగోళంగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేసాడు అనిల్.  

సరేగానీ ఇంతకూ నీ ఓటు ఎవరికో చెప్పలేదు... అని అడిగాడు అఖిల్ అనిల్ ను... ఇంకెవరికి నోటుకే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు అనిల్. ఇద్దరూ కాసేపు నవ్వుకొని... నా ఓటు మాత్రం పార్టీ కి కాకుండా పర్సన్ ను చూసి ఏద్దామనుకుంటున్న... వ్యవస్థ మార్పు కోసం సరైన వ్యక్తిని ఎంచుకొని ఓటేస్తా  అని అఖిల్ అనగానే... నేను అదేపని చేస్తా... వాళ్ళు ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఎంత సంపాదిస్తారో అర్ధం చేసుకోవాలి. అందుకే ఖర్చు చేయని, మనకు అందుబాటులో ఉండే నాయకునికి నా ఓటు అని అనిల్ తన అభిప్రాయం చెప్పగానే... ఇంతలో అక్కడికి ఓ పార్టీ గ్యాంగ్ రాణే వచ్చింది. 

ఏరా ఎవరికీ వేస్తున్నారు మీ ఓటు అని అడగనే అడిగారు. వీరు సమాధానం చెప్పేలోపే... సరేగానీ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చెబితే డబ్బులు పంపిస్తాం.. ఓటుమాత్రం మా నోటుకే అదే మా గుర్తుకే వేయండి సరేనా అంటూ చేబుతూ వెళ్లిపోయారు... 

అఖిల్, అనిల్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు...

రచన : గోగులపాటి కృష్ణమోహన్ 

సూరారం కాలనీ, హైదరాబాద్,

9700007653

 



Thursday, April 9, 2020

రాజుకు నలుగురు 18వ బాగం


రాజుకు నలుగురు 18వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

అప్పుడు నారదుడు ఆ దేవేంద్రుడిని పక్కకు తీసుకెళ్ళి... ఓ దానవేంద్రా... నీవు ఇంకేమీ ఆలోచించకు... ఇది నీ పూర్వ జన్మ శాప ఫలమే తప్ప మరొకటి కాదు. ఆ శాప ఫలమే నీవు ఈ మానవున్ని అల్లుడిగా స్వీకరించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసి వస్తుంది.. ఇది దైవేచ్చే తప్ప మరొకటి కాదు. అంటూ పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తాడు నారదుడు.
అప్పుడు తేరుకున్న దేవేంద్రుడు ఆ మానవున్ని తన అల్లుడిగా ప్రకటిస్తూ... తన కూతురితో పాటు... నాగకన్య, జలకన్య, అగ్ని కన్యలను ఇచ్చి ఘనంగా వివాహం జరిపించి భులోకానికి పంపిస్తారు.
భూ లోకానికి చేరుకున్న యువరాజుకు రాజ్య ప్రజలంతా ఘన స్వాగతం పలుకుతారు.  ఆ దేశ రాజు కూడా అస్వస్థతకు గురై తన రాజ్యానికి యువరాజుకే పట్టాభిషేకం చేస్తాడు...
యువరాజు చుట్టు ప్రక్కల రాజ్యాలన్నీ వీరోచితంగా పోరాడుతూ తన వశం చేసుకుంటాడు తన సోదరులను ఒక్కో రాజ్యానికి రాజులను చేసి రాజ్యాలను అప్పగిస్తాడు.
తన పరిపాలనలో రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటుంటారు.
ఒకరోజు నిండు పౌర్ణమి రోజున రాజు తల్లితండ్రులు మేడపైకి వెళ్ళి చూడగా... మల్లెపందిరి కింద పట్టెమంచం మీద తన చిన్న కొడుకు పడుకొని ఉండగా... నాలుగు దిక్కులు నలుగురు దేవకన్యలు తన కుమారునికి సపర్యలు చేస్తుండగా చూసిన ఆ రాజుకు ఆ రోజు కుమారుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి.... అవి "తండ్రీ..... పట్టె మంచంపై పడుకొని... నాలుగు ప్రక్కల నలుగురు సురకన్యలు నించుని చామరాలతో వీస్తుండగా.... హాయిగా నిద్రించాలని ఉంది ప్రభూ అని"...
వెంటనే తన భార్యతో... దేవీ చూడు నీ గారాల కుమారుడు... అన్నమాట నిలబెట్టుకున్నాడు అంటూ ఎంతో సంతోషిస్తాడు ఆ రాజు తన నలుగురు కుమారులతో... ఆ యువ రాజు తన నలుగురు భార్యలతో...
ఇదే ఆ రాజుకు నలుగురు..
సమాప్తం
ఈ కథ నా చిన్నవయసులో మా నానమ్మ కీll శేll రాలు గోగులపాటి నర్సుబాయమ్మ గారు నాకు చిన్నతనంలో చెప్పిన కథను అక్షరీకరించి మీకు అందించాను... అయితే దీనిని చదివిన కొందరు పాఠకులు (ప్రతిలిపి లో మరియు వాట్సప్ లలో) ఇది జగదేకవీరుని కథ (పాతది) పోలి వుందని తెలియజేశారు. అప్పుడు నేను ఆ సినిమా చూసాక తెలిసింది దాదాపుగా అలాగే ఉంది. (క్లైమాక్స్ తప్ప). కానీ ఇది నేను విన్న కథ ఆధారంగా మాత్రమే రాయడం జరిగింది అని తెలియజేస్తున్నాను.
కథను నిత్యం చదివి ప్రోత్సహించిన పాఠకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఙతాభివందనాలు తెలియజేసుకుంటూ...
రచయిత
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653


శుభం

రాజుకు నలుగురు 17వ బాగం

రాజుకు నలుగురు 17వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

మానవా.. ఇదుగో ఈ మహావృక్షం కొన్నేళ్ళ సంవత్సరాల క్రితంది.

ఈ మహా వృక్షాన్ని ఒక్కే ఒక్క గొడ్డలి పెట్టుతో కొట్టి కూల్చిచేయాలి అని పరీక్ష తెలియజేస్తాడు నారదుడు. అంతే కాదు నీవు ఇందుకోసం ఎవరిసహాయం కోరరాదు అని చెప్పి సేవకులారా... ఆయుధాలు తీసుకోనిరండి అని చెప్పగానే... దానికి సంబందించిన పలు విధాల గొడ్డల్లను తీసుకొచ్చి మానవుని ముందుంచుతారు... మానవా నీకు నచ్చిన ఆయుధాన్ని తీసుకోని మీరు పరీక్షలో పాల్గొనవచ్చు అని చెప్పగానే.. తాను తనకు నచ్చిన గొడ్డలి తీసుకోని ఆ మహా వృక్షం వద్దకు వెళ్తాడు...

ఏంటి ఈ రెండు పరీక్షలంటే వాటి సహాయం తీసుకున్నాను... ఈసారి ఎవరి సహాయం తీసుకోకుండా చేయమన్నారు... దీనికి బుద్దిబలం సరిపోదు, దేహబలం కూడా సరిపోదు... మరెలా? అని ఆలోచిస్తూ... తన ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తాడు...

ఇక గొడ్డలి తీసుకొని పైకెత్తి.... దైవాన్ని తలుచుకుంటూ... గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు.

అంతే అంతటి మహా వృక్షం పెలపెల మంటూ కిందికి విరుచుకు పడుతుంది... అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు... అదేమని అందరూ ఆ వృక్షం వద్దకు చేరుకుంటారు... ఎవ్వరికీ ఏమీ అర్ధం కాదు... చివరికి యువరాజుకు కూడా...

అక్కడే ఉన్న నారదుడు భళా మానవా భళా... నీవు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుక్కున్న తుమ్మెదలు నీ ఆపదను కనిపెడుతూనే ఉన్నాయి... ఈ పరీక్ష వాటికి తెలువగానే అవి ఆ మహా వృక్షాన్ని మొత్తం లోనికెళ్ళి వలిచిపెట్టాయు... నీవు అడగకున్నా వాటి ధర్మం అవి చేసాయి. నీకు తెలిసో తెలియకో నీవు అడగకున్నా మూగ ప్రాణాలకు చేసిన ప్రాణబిక్షే నిన్ను ఈనాడు కాపాడాయు. అంతే కాదు. అవి నీకు ఏవిధంగా సహాయపడగలవు అని నీ మనసులో కూడా నీవు అనుకున్నావు... చూసావు కదా ఎప్పుడు ఏ ప్రాణి ఏవిధంగా సహాయం పడుతుందో తెలిసిందికదా... అని చెబుతాడు.

అందుకు ఆ యువరాజు ఆ తుమ్మెదలకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ... నారదునికి నమస్కరిస్తాడు...

మానవా మేము పెట్టిన అన్ని పరీక్షలలో నీవు నెగ్గావు... ఇక దేవేంద్రుడి నిర్ణయమే తదుపరి అని నారదుడు చెప్పినా... దేవేంద్రుని మనసు ఎందుకో అంగీకరించడం లేదు.

ఇంకా ఉంది 18వ బాగం

రాజుకు నలుగురు 16వ బాగం

రాజుకు నలుగురు 16వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

ఎలా అని అలోచిస్తుండగా... అతని కాలుకు చీమ వచ్చి కుడుతుంది. వెంటనే అబ్బా అని చూడగా కాలుకింద చీమ... దానిని చూడగానే అది ఏం యువరాజా... ఆపదకాలంలో మాకు సహాయం చేసావు మరచిపోయావా? లేక ఈ చీమలు నాకేం సహాయపడుతాయని సందేహమా? అని అడగానే... ఆ యువరాజు ఎంతో సంతొషపడి... ఓ చీమలారా... మీరు నాకు ఈ సహాయం చేసిపెడితే నా జన్మంతా ఋణపడి ఉంటాను అని ప్రాధేయపడుతాడు.

తప్పకుండా అని ఆ చీమలు హామీ ఇచ్చి వాటి పనిలో అవి నిమగ్నమవుతాయి...

ఇంకేం నారదుడు పరీక్ష ప్రారంభించడమే ఆలస్యం ఇసుక కుప్ప చూస్తుండగా కదిలిపోతుంటుంది... లెక్కకు మించిన చీమలు ఇచ్చిన సమయానికి ముందే దేనికది వేరు చేసి పెడుతాయి.

వెంటనే యువరాజువా చీమలకు ప్రణమిల్లి కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

అది చూస్తూ నిశ్శేష్టులైన దేవేంద్రుడు... అంతా మోసం ఇది మానవుడు స్వయంశక్తితోనో... మేధాశక్తితోనో చేసింది కాదు... అని ఆక్షేపణ చెప్పగానే... నారదుడు ఇలా అంటాడు...

ఓ దేవేంద్ర... మీ పరీక్లలో ఎక్కడా ఆ మానవుడు స్వయంగా చేయాలి అని చెప్పలేదు కదా అని అనగానే...

అప్పుడు దేవేంద్రుడు సరే... ఈ సారి మానవుడే స్వయంగా చేసే పరీక్ష పెడ్టండి అంటాడు.

అప్పుడు నారదుడు తీవ్రంగా ఆలోచించి సరే అంటాడు.

మానవా ఈ సారి పరీక్షలో నీవే ప్రత్యక్షంగా పాల్గొని గెలిస్తేనే దేవకన్యలు నీ వశం అవుతారు లేదంటే దేవేంద్రుడి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి..

మానవా ఇప్పటివరకు నీవు గతంలో చెసిన సహాయసహకారాలు నీకు ఈ విందంగా మెలు చేసిపెట్టాయి, ఇక నీకా అవకాశం లేదు ఎందుకంటే ఈసారి నీవే ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది కావట్టి నీవు ఇప్పటికైనా తప్పుకోని నీ భూలోకం వెళ్లి హాయిగా నీకు నచ్చిన మానవ కన్య ను చేసుకోని హాయిగా బ్రతుకుము. అందుకు నీకేం కావాలో దేవేంద్రుడితో అడిగి ఇప్పిస్తా... లేదంటే నీ ప్రాణాలకే అపాయం సుమా! అని సలహా ఇస్తాడు.

అందుకు ఆ యువరాజు మాట్లాడుతూ... మునీంద్రా... ప్రేమ సాక్షిగా వివాహం చేసుకున్న నా భార్యలను ఇక్కడ విడిచి పెట్టి వెళ్తే నా యీ జన్మకు ఫలితం ఏముంటుంది? నా భార్యలు లేని ఈ ప్రాణం తృణప్రాయం. అప్పుడు అది ఉన్నా ఒకటే... లేకున్నా ఒకటే...

ఏది ఏమైనా ఈ పోటీలో పాల్గొంటా... విజయం సాధిస్తా... నా భార్యలను తీసుకోని వెళ్తా అని గట్టిగా సమాధానం ఇస్తాడు యువరాజు.

అప్పుడు నారదుడు నారాయణ నారాయణ అంటూ సరే మానవా... నీ యిష్టం ఇక నీకు మూడవ పరీక్ష... ఈ పరీక్షలో నీవే ప్రత్యక్షంగా పాల్గొని గెలవాల్సి ఉందని పరీక్ష ఏంటో చెబుతాడు ఇలా చెబుతాడు నారదుడు.

ఇంకా ఉంది 17వ బాగం

రాజుకు నలుగురు 15వ బాగం

రాజుకు నలుగురు 15వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

ఇలా అలోచిస్తుండగానే భటుడు ఉమ్మివేయనే వేసాడు..

ఇంతలో మానవుడికి ఒక ఆలోచన వస్తుంది... తనకు ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామని ఆరోజు మండూకాలు (కప్పలు) చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే... వాటిని ప్రార్ధిస్తాడు... ఓ మండూకాల్లారా... ఆనాడు మీనుండి ఎలాంటి సహాయం ఆశించి మిమ్మల్ని కాపాడలేదు. కానీ ఈనాడు నేను ఒక మిత్రునిగా మీ సహాయం కోరుతున్నాను... నా ప్రేమే నిజమైతే... ఈ కొలనులోని అంగుళీకాన్ని నాకు త్వరితగతిన తెచ్చివ్వగలరు అని ప్రాధేయపడుతాడు.

తలచినదే తడవుగా... అంగుళీకానితో ఒడ్డుకొస్తుంది మండూక రాజు...

ఓ యువరాజా... నీకు మేము సహాయ పడినందుకు మా జన్మ ధన్యమయ్యింది మిత్రమా... నీ ఋణం ఇలా తీర్చుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వెల్లిపోతాయి.

వాటి సహాయానికి ఎంతో సంతోషిస్తూ... మనసులోనే ఆ మండూకానికి కృతజ్ఙతలు తెలియజేసుకుంటూ...ఆ అంగుళీకాన్ని సభకు అందజేస్తాడు మానవుడు.

ఈ హటత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యచకితులవుతారు. దేవేంద్రుడు మాత్రం ఆగ్రహానికి గురౌతాడు.

నారదా... ఇది అన్యాయం... ఇందులో ఈ నరుడి గొప్పతనం ఏముంది. మేము అంగీకరించము అనగానే... అందుకు నారదుడు... నారాయణ నారాయణ... దేవేంద్రా... మీరేమన్నారు... మొసళ్ళను చంపకుండా... నీటిన తడవకుండా తేవాలని కదా... మరి అదెలా సాధ్యం... ఇలా అసాధ్యమైన పరీక్ష సుసాధ్యం చేయడం అనేది సాధారణ విషయం కాదు... ఈ మానవుడు ఈ పరీక్షలో నెగ్గాడు... ఇది నా నిర్ణయం అని దేవేంద్రుడికి నచ్చచెప్పి... తదుపరి పరీక్షకు సిద్దమవ్వమని మానవునికి చెబుతాడు.

అందుకు ఆ మానవుడు సంసిద్ధత వ్యక్తపరుస్తాడు...

సరే నీ రెండో పరీక...

ఎవరక్కడ...

పుట్టడు తిలాలు (నువ్వులు) తీసుకోని రండి అని ఆజ్ఙాపించగానే సేవకులు తిలాలు తీసుకొస్తారు.

అలాగే వీటికి రెట్టింపు ఇసుకను తెచ్చివ్వండి...

అనగానే అవీ తెచ్చిస్తారు సేవకులు...

అవి రెండిటినీ కలపండి అని చెప్పగానే ఆ ఇసుకలో నువ్వులు కలిపేస్తారు..

మానవా... ఇక నీ పని... నీకు అర ఝాము (గంటన్నర / 3.5 ఘడియలు) సమయం కేటాయిస్తున్నాము... ఈలోగా ఈ తిలాలను ఆ ఇసుక నుండి వేరు చేయాలి అనగానే...

ఆ మానవుడు ఇదెక్కడి పరీక్ష అనుకుంటూ ఎలా అని ఆలోచనలో పడుతాడు.

ఇంకాఉంది 16వ బాగం

రాజుకు నలుగురు 14వ భాగం

రాజుకు నలుగురు 14వ భాగం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

అందరూ ఆసక్తిగా చూస్తుంటారు... మరోసారి మహేంద్రుడు ఆ మానవున్ని సభాముఖంగా... సర్వదేవుళ్ళ సాక్షిగా ప్రమాణం చేయమంటారు... ఆ యువరాజు అందరిమీదా చేస్తాడు... అయినా నమ్మకం కలగని ఆ దేవేంద్రుడు భూలోకవాసులకు మాతాపితలన్న మహా భక్తి.. మీ తలిదండ్రులమీద ప్రమాణము చేయమనగానే అదీ చేస్తాడు యువరాజు.

ఇక చేసేదేమీ లేక నారదా... ఈ సమావేశాన్ని మీ సారధ్యంలో నిర్వహించండి అని భాధ్యతలను నారదునికి అప్పగిస్తాడు దేవేంద్రుడు.

నారాయణ నారాయణ.... ధన్యోస్మి ధన్యోస్మి దేవేంద్రా... తప్పకుండా మీ ఆజ్ఙ శిరసావహిస్తాను కానీ... నా తుది నిర్ణయాన్ని మాత్రం అందరూ ఆమోదిస్తా అంటేనే నేను ఈ బాధ్యత చేపడుతాను అనగానే దేవేంద్రుడు సరే మాకునూ ఆమోదమే అని తెలుపుతాడు.

మానవా... ఇక మొదలెడుదామా అని అనగానే నేను సిద్ధము మునీంద్రా అని ఆ యువకుడు తెలుపుతాడు.

సరే ఇక కాచుకో... నీకు మూడు పరీక్షలు నిర్వహిస్తాము... ఇందులో అన్ని పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది. ఇదా, అదా, కూడదు, నావలన కాదు లాంటి సమాధానాకు నీ ఓటమి సూచించేవిగా గుర్తుంచుకో గలరు అని సెలవిస్తారు నారదుడు.

సరే మునీంద్రా నా ప్రేమే నిజమైతే మీరు పెట్టే అన్ని పరీక్షలు నెగ్గి నా దేవకన్యలతో నా భూలోకమేగుతాను... లేదంటే ఇక్కడే నా ప్రాణమొదులుతాను అని చెప్పగానే చాటుమాటుగా ఉండి ఇదంతా కనిపెడుతున్న దేవకన్యల మనస్సు చివుక్కు మంటుంది.

ఇంతగా ప్రేమించే భూలోక వాసిని మనం కాదనుకున్నాము కదా అని లోలోన బాధపడుతుంటారు.

నారాయణ నారాయణ... నీకు మొదటి పరీక్ష...

మానవా... ఇదిగో అంగుళీకము... దీనిని ఈ మొసళ్ళు ఉన్న కొలనులో వేస్తాను... మా బటుడు ఉమ్మివేసిన ఉమ్మి తడి ఆరే లోగా నీవు తడవకుండా, మొసళ్ళను చంపకుండా ఆ అంగుళీకాన్ని మాకు అందించాలి అనగానే మానవుడు ఆలోచనలో పడుతాడు.

అంగుళీకము తీయడము సులువే... కానీ...
మొసళ్ళను చంపకుండా... అదీ తడవకుండా... ఇదెలా సాధ్యము అని ధీర్ఘాలోచనలో పడుతాడు మానవుడు.

ఇంకా ఉంది 15వ బాగము


రాజుకు నలుగురు 13వ భాగం

రాజుకు నలుగురు 13వ బాగం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

దేవేంద్రా... మీరు ఔనన్నా... కాదన్నా... ఆ నరుడు మీ అల్లుడు కాక మానడు. మీరు మామలు అవ్వక మానరు.

ఇప్పుడు మీ కింకర్తవ్యం ఒక్కటే... అతడిని అల్లుడిగా అంగీకరించడం తప్ప మరొక మార్గం లేదు.

ఇలా అనగానే దేవేంద్రుడు ఆగ్రహానికి గురయ్యాడు... చాలు నారదా చాలు.. ఇందుకా నిన్ను పిలిచింది... భలే సలహా ఇచ్చావయ్యా... సరే సరే... మీరు ఇక బయలుదేరండి లేదా ఏదైనా మంచి ఉపాయమైనా సెలవివ్వండి అని అనగానే... అప్పుడు నారదుడు తీక్షణంగా ఆలోచించి... నారాయణ నారాయణ... ఒక ఉపాయం చెబుతాను వినండి అని... ఈ విధంగా చెబుతాడు...

దవేంద్రా... మీరు వదిలిచ్చుకుందామన్నా ఆ నరుడు మిమ్మల్ని వదిలిచ్చుకునేలా లేడు. కావున అతడిని మీరు అల్లుడుగా ఆమోదించాలంటే కొన్ని పరీక్షలు పెట్టండి. అందులో అతడు నెగ్గితేనే మీ కూతుర్లను ఇచ్చి వివాహం చేసిపంపుతామని చెప్పండి అని చెప్పగానే... ఇదేదో బాగుందే... కానీ ఆ నరుడు అవికూడా సాధిస్తే ఏంటి అని సందేహం వ్యక్తం చేస్తాడు దేవేంద్రుడు.

అప్పుడు నారదుడు మామవ మాత్రుడు చేయలేని పరీక్షలే పెడుదాం అని చెప్పగానే... అందరూ సరే అని ఆ ప్రశ్నలేంటో నారదున్నే అడిగి తెలుసుకొని వెళ్తారు.

ఒకరోజు దేవలోకం లో సమావేశం ఏర్పాటు చేసి నరున్ని ప్రవేశపెట్టండి అంటూ దూతలకు సమాచారం ఆదేశించగానే దూతలు ఆ మానవున్ని సభలో హాజరు పరుస్తారు.

ఓ మానవా నిన్ను మా అల్లునిగా స్వీకరించాలంటే నీవు మా పరీక్షలను నెగ్గాలి. లేదంటే నీవు సామాన్యుడిగా నీ లోకం వెళ్ళిపోవాలి అని చెప్పగానే ఆ మానవుడు సరే అని పరీక్షకు సిద్దమవుతాడు.

 సరే ఇది నీ మొదటి పరీక్ష...

ఇంకా ఉంది 14వ భాగం

మీ
గోగులపాటి కృష్ణమోహన్